లైఫ్‌‌ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న ఎస్పీ చరణ్

లైఫ్‌‌ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న ఎస్పీ చరణ్

సింగర్ ఎస్పీ చరణ్ నటుడిగా రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘లైఫ్‌‌’ (లవ్ యువర్‌‌‌‌ ఫాదర్‌‌‌‌). శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించగా నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. 

తాజాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన టీమ్ మీడియాతో ముచ్చటించారు.  కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం, తండ్రి కోసం కొడుకు చేసే పోరాటమే ఈ చిత్ర కథ అని, తండ్రి పాత్రలో ఎస్పీ చరణ్‌‌ ఈ సినిమాకు ప్లస్ అవుతారని దర్శకుడు చెప్పాడు.  

‘శివతత్వాన్ని చూపిస్తూ కాశీ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వస్తున్న ఈ చిత్రంలో మణిశర్మ మ్యూజిక్‌‌ హైలైట్‌‌గా నిలుస్తుందని  నిర్మాతలు తెలియజేశారు.  ఏప్రిల్ 4న సినిమా విడుదల కానుంది.