ములుగును డ్రగ్స్‌ రహిత జిల్లాగా మారుద్దాం : ఎస్పీ డాక్టర్​ పి.శబరీష్​

ములుగును డ్రగ్స్‌ రహిత జిల్లాగా మారుద్దాం : ఎస్పీ డాక్టర్​ పి.శబరీష్​

ములుగు, వెలుగు : డ్రగ్స్​రహిత ములుగు జిల్లా కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని, అందుకు అవసరమైన శిక్షణ ద్వారా అవగాహన పెంచుకోవాలని ఎస్పీ డాక్టర్​ పి.శబరీష్​ పిలుపునిచ్చారు. గురువారం ములుగులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నార్కోటిక్​ డ్రగ్స్​ అండ్ ​సైకోట్రోపిక్​ సబ్​స్టాన్సెస్​(ఎన్​డీపీఎస్​) చట్టంపై పోలీసు అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

నార్కోటిక్​ విభాగం డీఎస్పీ నరసింగరావు నార్కోటిక్​ చట్టంపై అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్​ జోలికి పోవద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ  శివం ఉపాధ్యాయ, ములుగు డీఎస్పీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.