భద్రాద్రికొత్తగూడెం. వెలుగు: పోలీస్ అమర వీరుల స్ఫూర్తితో శాంతి భద్రతల పరిరక్షణకు అంకితమవుదామని ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని హేమచంద్రాపురంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించారు. అమరవీరుల స్థూపానికి ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ పోలీసులు ముందున్నారన్నారు.
ప్రోగ్రాంలో ఓఎస్డీ సాయి మనోహర్, ఏఆర్ అడిషనల్ఎస్పీ విజయ్ బాబు, ఏఎస్పీ పంకజ్ పరితోష్, డీఎస్పీలు వెంకటేశ్, రెహమాన్, రాఘవేందర్రావు, రమణమూర్తి, మల్లయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు. అలాగే లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ ఆరో బెటాలియన్లో అమరవీరుల స్థూపం వద్ద బెటాలియన్ ఆఫీసర్లు నివాళి అర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ అంజయ్య, ఏఓ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమాండెంట్స్ సీతారాం, నాగేశ్వరరావు, కాళీదాసు, వీరన్న, ఆర్ఐ, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.