కందనూలు, వెలుగు: చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాండ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. బిజినేపల్లి పోలీస్ స్టేషన్ బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా నడుచుకోవాలని చెప్పారు. గ్రామాల్లో నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకోవాలని చెప్పారు. కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహణ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కనకయ్య, ఎస్సై నాగ శేఖర రెడ్డి సిబ్బంది ఉన్నారు.