ములుగులో నేరాలు పెరిగినయ్‌‌‌‌‌‌‌‌ : ఎస్పీ గౌస్‌‌‌‌‌‌‌‌ ఆలం

  •     గతేడాదితో పోలిస్తే 7.94 శాతం పెరిగిన క్రైమ్స్‌‌‌‌‌‌‌‌
  •     మేడారం జాతరను సక్సెస్​ చేస్తాం
  •     ఇయర్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసిన ఎస్పీ గౌస్‌‌‌‌‌‌‌‌ ఆలం

ములుగు, వెలుగు : గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ములుగు జిల్లాలో నేరాలు 7.94 శాతం పెరిగాయని, ప్రాపర్టీ కేసులు 59 శాతం తగ్గాయని ఎస్పీ గౌస్‌‌‌‌‌‌‌‌ ఆలం చెప్పారు. పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు, సిబ్బంది కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌తో పనిచేసి నేరాల నియంత్రణకు కృషి చేశారన్నారు. ములుగు ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో శనివారం ఇయర్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గతేడాది 175 ప్రమాదాల కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 124 నమోదయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఈ సంవత్సరం 10 మాత్రమే నమోదు అయ్యాయని, గతేడాదితో పోలిస్తే 58 శాతం తగ్గాయన్నారు.

గతేడాది మొత్తం రూ.2 కోట్ల విలువైన 757 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. మోటార్‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద 28,819 కేసులు నమోదు చేసి రూ.55.51 లక్షలు వసూలు చేశామన్నారు. ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారని, 40 మంది మావోయిస్టులు, సానుభూతిపరులను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు తెలిపారు. నేరాల నియంత్రణకు కృషి చేసిన పోలీసులకు అభినందనలు తెలిపారు.

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ అశోక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఏటూరునాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ సదానందం, అడ్మిన్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ఐ సతీశ్‌‌‌‌‌‌‌‌, డీఎస్పీలు రవీందర్, సుభాశ్‌‌‌‌‌‌‌‌బాబు పాల్గొన్నారు.