ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్​లో ఉన్న కేసులను పరిష్కరించాలి : ఎస్పీ గౌస్​ఆలం

ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్​లో ఉన్న కేసులను పరిష్కరించాలి : ఎస్పీ గౌస్​ఆలం

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఎంతో కాలంగా పెండింగ్​లో ఉన్న కేసులను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు ఆదిలాబాద్​ఎస్పీ గౌస్​ఆలం సూచించారు. గురువారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్  మీటింగ్ హాల్​లో నెలవారీ క్రైమ్ ​రివ్యూలో భాగంగా అన్ని పోలీస్​ స్టేషన్ల అధికారులతో సమావేశమయ్యారు. 

నేరాలను నివారించేందుకు గస్తీ, పెట్రోలింగ్ నిర్వహిస్తూ, బీట్ పద్ధతిని అనుసరించాలని సూచించారు. డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్ రెడ్డి, సీహెచ్.నాగేందర్, సీఐలు, రిజర్వ్ ఇన్​స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.