
ఆదిలాబాద్ టౌన్/నిర్మల్/ నస్పూర్, వెలుగు : యువత తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కుటుంబసభ్యులను మదిలో ఉంచుకొని వాహనాలు జాగ్రత్తగా నడపాలని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రవాణాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నలంద కాలేజీ విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు.
.రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. డీఎస్పీ పోతారం శ్రీనివాస్, రూరల్ సీఐ సైదారావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్కాలేజ్ డైరెక్టర్ మెంబర్ విజయబాబు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల కోరారు. రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా నిర్మల్మండలంలోని అక్కాపూర్‌లో హెల్మెట్‌పై అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.
హెల్మెట్ వస్తువు కాదని, ప్రాణాన్ని కాపాడే రక్షణ ఆయుధమన్నారు. హెల్మెట్ లేకపోవడం కారణంగానే ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నట్లు చెప్పారు. డీఎస్పీ గంగారెడ్డి, ఎంవీఐ అజయ్ కుమార్ రెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.