ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం : ఎస్పీ గిరిధర్

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం : ఎస్పీ గిరిధర్

వీపనగండ్ల, వెలుగు: ఒక్క సీసీ కెమరా వంద మందితో సమానమని  ఎస్పీ గిరిధారావు అన్నారు.  చిన్నంబావి మండల పరిధిలోని వెల్టూరు గ్రామంలో కాంగ్రెస్   నాయకుడు కొత్త కళ్యాణ్ రావు    ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శనివారం  ఎస్పీ ప్రారంభించారు.  అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడారు.   మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు గ్రామంలోని అధికారులు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అయన  అన్నారు. 

అనంతరం చిన్నంబాయి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. విధుల్లో  నియంత్రణలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో  పనిచేయాలని  సూచించారు.కృష్ణనది తీరంలో నిషేధిత  అలివి వలల పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని  ఎస్సై జగన్మోహన్ ను ఆదేశించారు.  కార్యక్రమంలో వనపర్తి సీఐ మద్దెల కృష్ణ ,   కాంగ్రెస్  మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్  పాల్గొన్నారు.