నిర్మల్, వెలుగు: పోలీసు శాఖలోని క్రీడాకారులను మరింత ప్రోత్సహిస్తామని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర మూడో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పతకాలు సాధించిన నిర్మల్ పోలీసులను బుధవారం ఎస్పీ అభినందించారు.
ఇప్పటికే నిర్మల్ పోలీసులు జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభను కనబరిచి సత్తా చాటారన్నారు. స్టేట్ స్పోర్ట్స్ మీట్లో పతకాలు సాధించిన నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ కల్యాణి, ఏఆర్ హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ముత్యంను ఎస్పీ శాలువాతో సన్మానించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ రామ్ నిరంజన్ రావు, ఆర్ఎస్ఐ రవి కుమార్, సిబ్బంది పాల్గొ న్నారు.