వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలోని పోలీస్ వాహనాలను కండీషన్ లో ఉంచుకోవాలని ఎస్పీ రక్షిత కే మూర్తి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ వాహనాలను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 15 పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం కొత్త వాహనాలను అందజేసిందని చెప్పారు.
వాహనాలను నిరంతరం పరిశీలించాలని సూచించారు. నెల వారీగా తనిఖీలు చేసి వివరాలు అందించాలని ఎంవీఐ శ్రీనివాస్ ను ఆదేశించారు. వెహికల్స్‌ను కండిషన్లో ఉంచుకోవాలని డ్రైవర్లకు సూచించారు. డ్రైవర్లకు వాహనాల మెయింటెనెన్స్‌పై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పలనాయుడు పాల్గొన్నారు.