ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి : కె.నరసింహ

ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి :  కె.నరసింహ
  • ఎస్పీ కె.నరసింహ

సూర్యాపేట, వెలుగు : బాధితుల ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.నరసింహ పోలీస్​అధికారులను ఆదేశించారు. పోలీస్ గ్రీవెన్స్ భాగంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. 

 సీజ్ చేయబడిన వాహనాలకు ఆరు నెలల గడువు..

వివిధ నేరాలు, తనిఖీల్లో పోలీసులు సీజ్​చేసిన ద్విచక్ర వాహనాలను ఆరు నెలల్లోపు యాజమానులు సరైన పత్రాలు చూపించి తీసుకెళ్లాలని ఎస్పీ నరసింహ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్ మోటార్ వాహనాల విభాగంలో ఉన్న 120 ద్విచక్ర వాహనాలు విడిపించుకోవాలని సూచించారు. లేదంటే కాలం చెల్లిన వాహనాలను వేలం వేస్తామని తెలిపారు.