మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : పోక్సో, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్ క్రైమ్ కేసుల దర్యాప్తుపై శ్రద్ధ చూపాలని ఎస్పీ కె నరసింహ సూచించారు. బుధవారం ఎస్పీ ఆఫీస్లో నేర దర్యాప్తుపై పోలీస్ అధికారులతో సమీక్షించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పేలుడు పదార్థాల అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సైబర్ నేరాలను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో నియమించినట్లు పేర్కొన్నారు. ఏఎస్పీ రాములు, డీఎస్పీలు మహేందర్, రమణారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏవో రుక్మిణి, సీసీ రాంరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఎస్పీ ఆఫీస్ ఆవరణలో ప్రతిష్ఠించిన సురక్షా గణపతి మండపంలో జోగులాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్
ప్రత్యేక పూజలు చేశారు.