
మెదక్ టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా మహిళలకు రక్షణగా నిలవడమే షీ-టీమ్స్ ప్రధాన లక్ష్యమని జిల్లా అడిషన్ ఎస్పీ మహేందర్ అన్నారు. వినాయక చవితి నేపథ్యంలో షీటీమ్స్ పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ... స్నేహపూర్వకమైన పోలీసింగ్‌ను అందించాలని, మహిళలకు పూర్తిగా సురక్షితమైన, భద్రమైన వాతావరణాన్నిఅందించాలని సిబ్బందికి సూచించారు.
జిల్లాలో మెదక్, తూప్రాన్ డివిజన్ల వారీగా షీ - టీమ్స్ పని చేస్తున్నాయని చెప్పారు. ఎవరైనా మహిళలు వేధింపులు ఎదుర్కొంటే వెంటనే జిల్లా షీ-టీమ్ కు 8712657963 వాట్సాప్ ద్వారా,sheteammedakdistrict@gmail.com మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని మహేందర్ వివరించారు.