పల్నాడు ఏపీలోనే కాదు... దేశంలోనే చెత్త జిల్లా... ఎస్పీ మల్లికా గార్గ్...

ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణలు కలకలం రేపాయి. రాష్ట్రంలోని పలు ప్రణతాలతో పాటు అధికార ప్రతిపక్షాల మధ్య జరిగిన ఘర్షణలు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలను సీరియస్ గా తీసుకున్న ఈసీ అధికారులపై చర్యలు తీసుకుంది. జూన్ 4న కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఘర్షణలు పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఈ క్రమంలో పల్నాడు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ మల్లికా గార్గ్ జిల్లాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పల్నాడు జిల్లా ఏపీలోనే కాదు, దేశంలోనే చెత్త జిల్లా అని అన్నారు. పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉందని, దానిని చెడగొట్టొద్దని అన్నారు మల్లికా. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. దాడులను ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని అన్నారు. పోలీసులు అంటే ఎవరికీ భయం లేదని, జిల్లా అంతా అరాచకంగా ఉందని, మంచి జిల్లాగా మారేందుకు అవకాశం ఉందని, ప్రజలు సహకరించాలని అన్నారు ఎస్పీ మల్లికా గార్గ్