
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఐటీ సెల్ జిల్లాకు వెన్నుముక లాంటిదని ఎస్పీ పరితోశ్ పంకజ్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని జిల్లా పోలీస్ ఆఫీసులో ఐటీ ల్యాబ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పీఎస్‌లలో ఎలాంటి టెక్నికల్ సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించేలా నైపుణ్యం కలిగి ఉండాలని సూచించారు.
మిస్సింగ్, కిడ్నాప్ కేసుల్లో లోకేషన్స్ ఆధారంగా కేసులను ఛేదించడంలో, సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన డబ్బులను హోల్డ్ చేయడం, తిరిగి బాధితులకు అప్పగించడం, మాదకద్రవ్యాల నిర్మూలనలో ఐటీ సెల్ సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. ఎస్పీ వెంట ఐటీ సెల్ ఇన్స్పెక్టర్కిరణ్ కుమార్, ఐటీ సెల్ సిబ్బంది ఉన్నారు.