పెండింగ్  కేసులు పరిష్కరించాలి : ఎస్పీ రాహుల్ హెగ్డే 

సూర్యాపేట, వెలుగు : దీర్ఘకాలికంగా పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసుల పరిష్కారానికి  చర్యలు తీసుకోవాలని  ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీసులను ఆదేశించారు.  మంగళవారం  జిల్లా పోలీసు కార్యాలయంలో  అడిషనల్  ఎస్పీ నాగేశ్వరావు, ట్రైనీ ఐపీఎస్‌‌‌‌ అధికారి రాజేశ్ మీనాతో కలిసి నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన కేసులను తర్వగా ఛేదించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రణాళిక ప్రకారం పనిచేయాలని,  గంజాయి నివారణలో ప్రజలను భాగస్వాములుగా చేయాలని సూచించారు.

విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయించి గంజాయి వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించాలని కోరారు.  వచ్చే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం పలు కేసుల్లో నేరస్తులకు శిక్ష పడడంలో కీలకంగా పనిచేసిన భరోసా సెంటర్  ఎస్సై మౌనిక, ఏఎస్ఐ సైదాబి, నేరెడుచర్ల పీఎస్‌‌‌‌ కోర్టు కానిస్టేబుల్ లింగయ్య, మోతే  కానిస్టేబుల్ రవీందర్‌‌‌‌‌‌‌‌కు ప్రశంసా పత్రాలు అందించారు.

నార్కోటిక్ డాగ్ రోలెక్స్‌‌‌‌కు సిల్వర్ మెడల్ 

ఈ నెల 16న లక్నోలో జరిగిన 67వ  ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌‌‌‌లో సూర్యాపేట జిల్లా పోలీసు విభాగానికి చెంది నార్కోటిక్ డాగ్ రోలెక్స్  నార్కోటిక్ పదార్థాల గుర్తింపులో సిల్వర్ మెడల్ గెలిచింది.  ఈ మెడల్‌‌‌‌ను మంగళవారం ఎస్పీ రాహుల్ హెగ్డే  రోలెక్స్‌‌‌‌కు అందజేశారు. అనంతరం డాగ్ హ్యండిలర్ సతీష్, ఇన్‌‌‌‌చార్జి అధికారులను అభినందించారు.