కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళిక రూపొందించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశించారు. శనివారం కోదాడ పట్టణంలో రద్దీగా వున్న ప్రాంతాలను సందర్శించారు. అనంతరం ట్రాఫిక్ సమస్య పై పోలీసు అధికారులను సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎక్కువ సిబ్బందిని నియమించాలని
వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ ను సందర్శించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ ప్రకావ్, సీఐ రాము, ఎస్సైలు యాదవెంద్ర రెడ్డి , రాంబాబు ఉన్నారు.