గంజాయి నియంత్రణకు స్పెషల్ టీమ్స్‌‌‌‌‌‌‌‌ :  ఎస్పీ రాహుల్ హెగ్డే 

సూర్యాపేట, వెలుగు:  జిల్లాలో గంజాయికి అలవాటు పడ్డవారిని గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశామని  ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.  గురువారం ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడుతూ .. గంజాయి యువశక్తిని నిర్వీర్యం చేస్తుందని, దీని మూలాలను నాశనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువకులు, విద్యార్థులు గంజాయికి అలవాటు పడితే  టీచర్లు, పేరెంట్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.  

గంజాయి నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అమ్మినా, కొన్నా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  ఈ యేడు జిల్లాలో  650 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని 25 కేసులు నమోదు చేశామన్నారు.  59 మందిని అరెస్టు చేసి ఒకరిపై  పీడీ యాక్ట్ నమోదు చేశామని వెల్లడించారు.