సూర్యాపేట, వెలుగు : నూతన చట్టాలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. నూతన చట్టాలపై పోలీసు సిబ్బందికి విడతల వారీగా వారం రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన చట్టాలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి ఎస్పీ ప్రారంభించారు.
సీనియర్ హైకోర్టు అడ్వకేట్, సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, తెలంగాణ పోలీస్ అకాడమీ అధ్యాపకులు వారం రోజులపాటు పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి అంశంపై సిబ్బందికి అవగాహన, నైపుణ్యం ఉండాలని, అప్పుడే కచ్చితంగా చట్టాలను అమలు చేయగలమన్నారు. పోలీసు సిబ్బంది, అధికారులు ప్రతిఒక్కరూ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.