
వనపర్తి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మీడియా పారదర్శకంగా వ్యవహరించాలని ఎస్పీ రక్షిత కె మూర్తి కోరారు. శుక్రవారం ఎస్పీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే వెంటనే ఫిర్యాదు చేసేందుకు సి విజిల్ యాప్ అందుబాటులో ఉందని ఎస్పీ చెప్పారు.టోల్‌ఫ్రీ నెంబర్1950, లేదా గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మీడియా సహకరించాలని కోరారు. డీఎస్పీ ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు.