వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో భాగంగా ప్రజలకు భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. డీఎస్పీ ఆనంద రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ టి రాబిన్, ప్రమోద్ జా, ఎస్బీ ఇన్స్పెక్టర్ మధుసూదన్, సీఐలు మహేశ్వర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, రత్నం, ఆర్ఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు, యుగంధర్ రెడ్డి, జయన్న, జలంధర్ రెడ్డి, వినోద్, సురేందర్ పాల్గొన్నారు.
మరికల్: ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పించేందుకు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడు తెలిపారు. మండల కేంద్రంతో పాటు వెంకటాపూర్ గ్రామంలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. సీఐ రాజేందర్, ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.