వనపర్తి, వెలుగు : తమ పిల్లలను చదివించుకోవాలని ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి సూచించారు. మంగళవారం ఇటుక బట్టీల్లో పని చేసే కార్మికుల పిల్లలు చదువుకోడానికి, జిల్లా కేంద్రం సమీపంలోని మెట్టుపల్లి బట్టీ వద్ద వర్క్‌సైట్ స్కూల్‌ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి కోసం ఒడిశా నుంచి వచ్చి ఇటుక బట్టీల్లో పని చేసే కార్మికుల పిల్లలు చదువుకునేందుకు వీలుగా ఎయిడెడ్ ఎట్ యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ వర్క్‌సైట్ స్కూల్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు.
కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు చదువు నేర్పించాలన్నారు. అనంతరం పిల్లలకు బుక్స్, స్కూల్ బ్యాగులు, బూట్లు, యూనిఫాం, పెన్సిళ్లు, నోట్బుక్స్అందించారు. 49 మంది పిల్లలు ఈ స్కూల్లో చేరారు. సంస్థ ప్రతినిధి సురేశ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నాగభూషణం, టౌన్ ఎస్ఐ జయన్న పాల్గొన్నారు.