వనపర్తి టౌన్, వెలుగు: ఓటర్లకు భరోసా కల్పించేందుకు కృషి చేయాలని ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సీఆర్పీఎఫ్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో జిల్లా పోలీసులతో కలిసి కేంద్ర బలగాలు పని చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాయని తెలిపారు.
ALS0 READ: పీడీ యాక్ట్ పెట్టినా గంజాయి అమ్ముడు మానలే .. 8 కిలోల సరుకు స్వాధీనం
ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా భరోసా కల్పించాలని సూచించారు. కీలకమైన పాయింట్‌ల వద్ద కేంద్ర బలగాలను ఉంచాలని, వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని డీఎస్పీ ఆనందరెడ్డిని ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అసిస్టెంట్ కమాండెంట్ రాబిన్, 13 సీ కంపెనీ అసిస్టెంట్ కమాండెంట్ ప్రమోద్ జా, 13 డీ కంపెనీ సిబ్బంది, సీఐలు మహేశ్వర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, రత్నం పాల్గొన్నారు.