- ఎస్పీ రావుల గిరిధర్
ఖిల్లాగణపురం, వెలుగు : విధుల పట్ల అంకితభావంతో ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం రాత్రి ఆయన ఖిల్లాగణపురం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్లో రికార్డ్స్ ను, పరిసరాలను పోలీస్టేషన్ రిసెప్షన్, లాకప్ , మెన్ బ్యారేక్, టెక్నికల్ రూంను పరిశీలించారు.
పోలీస్స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో నేరాలు, ఎక్కువగా జరుగుతున్నాయి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు వివరాలు, నేరస్థుల ప్రస్తుత పరిస్థితుల వివరాలను, పెండింగ్ లో ఉన్న కేసుల వివాలను ఎస్సై సురేశ్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాల నివారించడానికి కృషి చేయాలన్నారు. రోడ్లమీద ధాన్యం ఆరబోయరాదని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.