మధ్యవర్తి లేకుండా కేసుల పరిష్కారం : ఎస్పీ రావుల గిరిధర్

మధ్యవర్తి  లేకుండా కేసుల పరిష్కారం : ఎస్పీ రావుల గిరిధర్
  • ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి, వెలుగు :  ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా   పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి  సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని  ఎస్పీ రావుల గిరిధర్​ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు.  

ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత పోలీస్​ స్టేషన్​ అధికారులకు పలుసూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 11 ఫిర్యాదులలో నాలుగు భూఫిర్యాదులు, అయిదు పరస్పర గొడవలు, రెండు భార్యాభర్తలకు సంబంధించిన గొడవల ఫిర్యాదులు వచ్చాయి.