యువత ఉన్నత లక్ష్యాలు సాధించాలి : ఎస్పీ రావుల గిరిధర్

యువత ఉన్నత లక్ష్యాలు సాధించాలి : ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి టౌన్, వెలుగు : ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని  వనపర్తి  ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం వనపర్తి  ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో  నిర్వహించిన  సైబర్ సెక్యూరిటీ,  షీ- టీం  అవగాహన  కార్యక్రమానికి  ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.   విద్యార్థులు వారి తల్లిదండ్రుల కుటుంబ, ఆర్థిక , స్థితిగతులను అవగాహన చేసుకోవాలన్నారు.  జిల్లాలో ఎక్కడైనా ఆడపిల్లలు ఆకతాయిల వేధింపులు, ఈవ్ టీజింగ్ ఇతర  ఇబ్బందులకు గురి అయితే వెంటనే షీ -టీం వాట్సప్ నెంబర్ 6303923211 నెంబర్ కు సంప్రదించాలని కోరారు. 

షీం టీం ను ఆశ్రయించే బాధితుల వివరాలను చాలా గోప్యంగా ఉంచుతామని  తెలిపారు. రోడ్డు భద్రతలో భాగంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా అతివేగంతో వెళ్లడం, ట్రిపుల్ రైడింగ్ వంటివి చేయవద్దన్నారు. యువత డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాల భారిన పడవద్దన్నారు. యువత కు  విద్య, ఉద్యోగ ఉపాధిలో పోలీసుల పూర్తి సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో  వనపర్తి సీఐ, క్రిష్ణ , షీటీం ఎస్సై, అంజద్. కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్, లెక్చరర్స్ దాంసింగ్, వెంకట స్వామి, యాదగిరి గౌడ్, రామకృష్ణ మూర్తి, సునీతబాయి, మల్లికార్జున్ పాల్గొన్నారు.