భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని అన్ని బ్యాంకులు సరైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజ్ సూచించారు. ఈ విషయమై మంగళవారం బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల వరంగల్, బీదర్ ప్రాంతాల్లో బ్యాంకుల్లో జరిగిన దొంగతనాలను గుర్తు చేశారు. అలాంటి సంఘటనలు జిల్లాలో జరగకుండా బ్యాంకు అధికారులు పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. బ్యాంకు లోపల, బయట అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు.
సెక్యూరిటీ అలారం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏటీఎం లో నగదును లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్, ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.