భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రౌడీషీటర్లు, ఆకతాయిల పట్ల స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఎస్పీ బి. రోహిత్ రాజు సిబ్బందిని ఆదేశించారు. కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన సోమవారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
రౌడీషీటర్లు, ఆకతాయిలు, అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిత్యం నిర్వహించాలన్నారు. అవసరమైన చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పెట్రోలింగ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ రెహమాన్, సీఐ రమేష్ ఉన్నారు.