విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు : ఎస్పీ రోహిత్​ రాజు

విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు : ఎస్పీ రోహిత్​ రాజు
  • భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్​ రాజు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని ఎస్పీ బి. రోహిత్​ రాజు పోలీస్​ సిబ్బందిని హెచ్చరించారు. హేమచంద్రాపురంలోని పోలీస్​ హెడ్ క్వార్టర్​లో బుధవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. క్రికెట్​ బెట్టింగ్​లకు పాల్పడే వారి పట్ల ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.

 విధుల్లో అంకిత భావంతో పనిచేసే వారిని ప్రోత్సాహిస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలని ఆదేశించారు. డయల్​ 100 ఫోన్​ రాగానే సిబ్బంది స్పందించాలన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ కుమార్​ సింగ్​, డీస్పీలు చంద్రభాను, రెహమాన్, సతీశ్​కుమార్, సీఐలు శ్రీనివాస్, నాగరాజు, జితేందర్​ పాల్గొన్నారు.