
మునిపల్లి, వెలుగు : వాహనదారులందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని కంకోల్ టోల్ ప్లాజా ఆధ్వర్యంలో 35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను బుధవారం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఎస్పీ రూపేశ్ హాజరయ్యారు. అనంతరం వాహనదారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. వాహనదారులు హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ రమేశ్, కొండాపూర్ సీఐ చంద్రయ్య, సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ సుమన్ కుమార్, మునిపల్లి ఎస్ఐ సురేశ్ పాల్గొన్నారు.