
సంగారెడ్డి టౌన్, వెలుగు: రైటర్స్ కొరతను అధిగమించడానికి కొత్తగా చేరిన కానిస్టేబుళ్లకు 3 రోజుల శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రూపేశ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది ప్రతి ఒక్కరూ స్టేషన్ రికార్డుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ప్రతి రికార్డు హిస్టరీ షీట్స్ అప్ డేట్చేస్తూ పెండింగ్ లేకుండా చూడాలన్నారు. స్టేషన్ రైటర్స్ గా పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా ఎస్ హెచ్ వోలకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ఎస్పీ సంజీవరావు, డీటీసీ డీఎస్పీ నరేందర్ రెడ్డి , ఇన్స్పెక్టర్లు రమేశ్, కిరణ్, ప్రవీణ్ రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు.
క్యాంటీన్ ప్రారంభం
పోలీస్ సిబ్బంది పని ఒత్తిడి నుంచి సేద తీరడానికి జిల్లా పోలీస్ ఆఫీస్ఆవరణలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ తోడ్పడుతుందని ఎస్పీ రూపేశ్ తెలిపారు. సోమవారం క్యాంటీన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఇక్కడికి వచ్చిన సిబ్బంది సేద తీరడానికి క్యాంటీన్అనుకూలంగా ఉంటుందన్నారు. చాయ్, స్నాక్స్ అందుబాటులో ఉంటాయన్నారు.