ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : ఎస్పీ రూపేశ్​

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : ఎస్పీ రూపేశ్​
  • ఎస్పీ రూపేశ్​

 జహీరాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను అరికట్టాలని ఎస్పీ రూపేశ్ సూచించారు. మంగళవారం  జహీరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.  ఏటా జిల్లాలో 450 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడం బాధాకరమన్నారు. వాహనాలు నడిపేవారు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, మద్యం తాగి వాహనం నడపరాదని, అతివేగం ప్రమాదకరమన్నారు. 

సిగ్నల్ పడ్డప్పుడు వాహనం ఆపాలని, జంక్షన్ వద్ద నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫ్రాడ్ కాల్స్ లిఫ్ట్ చేయరాదని హితవుపలికారు . ఈ సదస్సులో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐలు శివలింగం, హన్మంతు, ఎంవీఐ వెంకటయ్య, ఎస్ఐలు కాశీనాథ్, రాజేందర్ రెడ్డి, సతీశ్, ప్రసాద్ రావు, రాజశేఖర్, స్టూడెంట్స్​, డ్రైవర్లుపాల్గొన్నారు.