పీఎస్​లలో న్యాయం జరగక పోతే నా వద్దకు రండి

ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగకపోతే తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేయొచ్చని, న్యాయం చేస్తానని ఎస్పీ శబరిష్ స్పష్టం చేశారు. సోమవారం ములుగు జిల్లా పోలీసు కార్యాలయం లో పలువురు బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు.