బంధాల అడవుల్లో 4జీ..టవర్​ ప్రారంభించిన ఎస్పీ శబరీష్

బంధాల అడవుల్లో 4జీ..టవర్​ ప్రారంభించిన ఎస్పీ శబరీష్
  • టవర్​ ప్రారంభించిన ఎస్పీ శబరీష్

ములుగు, తాడ్వాయి, వెలుగు : ఏజెన్సీలో సెల్​ ఫోన్​ సిగ్నల్స్​ పనిచేయక గిరిజనులు మైదాన ప్రాంతాల వారితో సంబంధాలు తక్కువగా ఉండేవి. ఈ క్రమంలో ఎస్పీ డాక్టర్​ పి.శబరీశ్​​ చొరవతో తాడ్వాయి మండలం బంధాల అడవుల్లో 4జీ సేవలు మొదలయ్యాయి. ఎయిర్టెల్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన ఎస్పీ టవర్​ ఏర్పాటు చేయించగా బుధవారం  ప్రారంభించారు.

దశాబ్ధాలుగా సెల్​ సిగ్నల్స్​ కు నోచుకోని ఆదివాసీ గిరిజనులకు 4జీ సేవలు అందడం సంతోషకరమన్నారు. ఈ టవర్​ తో బంధాల, పోచాపూర్​, అల్లిగూడెం, గొల్లపల్లి, నర్సాపూర్​ తదితర మారుమూల గ్రామాల ప్రజలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఏదైనా ఆపాద వస్తే 108కు సమాచారం ఇవ్వాలన్నా కూడా ఇబ్బందిగా ఉండేదని

సెల్​ టవర్​ ఏర్పాటుతో ఇబ్బందులు తొలగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ మేనేజర్ సుగుణాకర్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ సదానందం, మేనేజర్ రమేష్ బాబు, ప్రదీప్ మోతే, తదితరులు పాల్గొన్నారు.