ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి : ఎస్పీ సంగ్రామ్‌‌ సింగ్‌‌ పాటిల్‌‌

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్‌‌ రూరల్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌ను ఎస్పీ సంగ్రామ్‌‌ సింగ్‌‌ పాటిల్‌‌ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీసీటీఎన్‌‌ఎస్‌‌ ప్రాజెక్ట్‌‌లో నమోదు చేస్తున్న ఎఫ్‌‌ఐఆర్‌‌, సీడీఆర్‌‌, పార్ట్‌‌ వన్‌‌, పార్ట్‌‌ టు, డిమాండ్‌‌ డైరీ, చార్జ్‌‌షీట్‌‌, ఇంటరాగేషన్‌‌ రిపోర్ట్‌‌ను పరిశీలించారు. కమ్యూనిటీ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌‌ విధానాన్ని అమలు చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ సత్యనారాయణ, మహబూబాబాద్‌‌ రూరల్‌‌ సీఐ రమేశ్‌‌, ఎస్సై రాంచరణ్‌‌ ఉన్నారు.

ALS0 READ: ఢిల్లీకి చేరిన ఇల్లెందు టికెట్​ లొల్లి ఏఐసీసీ ఆఫీస్​ ముందు ఆందోళన