ప్రజల వద్దకు పోలీస్ బాస్ : ఎస్పీ శరత్ చంద్ర పవార్

  • ఎస్పీ శరత్ చంద్ర పవార్ వినూత్న కార్యక్రమం
  • నేడు నాగార్జునసాగర్​మండలంలో 'మీట్ యువర్​ఎస్పీ' ప్రోగ్రాం
  • జిల్లాలో తొలిసారిగా అమలు
  •  దూరప్రాంత ప్రజలకు సత్వర న్యాయమే ప్రధాన ఉద్దేశం

నల్గొండ, వెలుగు : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న ప్రజాపాలనలో భాగస్వామ్యం అయ్యేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ‘ప్రజల వద్దకు పోలీస్ బాస్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ఎస్పీ హోదాలో పోలీస్​స్టేషన్లు విజిట్​చేయడమేగాక, ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా 'మీట్​యువర్ ఎస్పీ' అనే కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేయబోతున్నారు.

తొలిసారిగా జిల్లాలో ప్రారంభంకానున్న ఈ కార్యక్రమం మారుమూల ప్రాంత ప్రజలకు సత్వర న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశం. గతంలో మహబూబాబాద్​జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం విజయవంతమైంది. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. జిల్లా కేంద్రం వరకు ప్రజలు రావాల్సిన అవసరం లేకుండా వాళ్ల వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరిస్తే దాని వల్ల వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ఎస్పీ శరత్​చంద్ర పవార్​'వెలుగు' తో చెప్పారు. 'మీట్​యువర్​ఎస్పీ' కార్యక్రమంపై ఆయన  మాటల్లోనే..

  • మండల స్థాయిలోనే ప్రజా'వాణి'

ప్రతి సోమవారం ప్రజావాణికి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్లడం ఇబ్బందికరం. దానికి బదులు నేనే ప్రజలకు వద్దకు వెళ్లాలని ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశా. జిల్లా స్థాయిలో ప్రజావాణి ఎట్లాగో.. మండల స్థాయిలో పోలీస్​శాఖ తరఫున నేనే స్వయంగా ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తా. వాళ్ల సాదకబాధకాలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తా. తద్వారా సత్వర న్యాయం జరుగుతుంది. ప్రతి మండలంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా. పోలీస్​స్టేషన్లు విజిట్​చేయడం ఒక్కటే డ్యూటీ కాకుండా ప్రజలకు స్థానికంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలైనా నా దృష్టికి తేవచ్చు. 

  • రేషన్ బియ్యం​దందాను కట్టడి చేసినం..

రేషన్​బియ్యం దందాను కట్టడి చేసినం. మిర్యాలగూడ డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐతోపాటు మరికొంత మందిపై కేసులు పెట్టి జైలుకు పంపించినం. రేషన్​బియ్యాన్ని డీలర్లకు ఇవ్వకుండా నేరుగా గోదాంల నుంచే బ్లాక్​మార్కెట్​కు తరలిస్తున్నరు. ఈ తరహా దందా ఎక్కువగా జరుగుతోంది. మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు తరలించే క్రమంలో రేషన్​బియ్యం పట్టుకున్నాం. గంజాయి రవాణాపై కూడా దృష్టి పెట్టాం. రౌడీల కదలికలపైన నిఘా పెట్టాం. డీఎస్పీలు వాళ్ల కదిలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా కబ్జాలు చేసినా, బెదిరించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 

  • నేడు సాగర్​లో ప్రోగ్రాం ఇలా..

తొలిసారి నాగార్జునసాగర్​లో జరిగే మీట్​యువర్ ఎస్పీ​ప్రోగాం సమాచారం ముందుగానే స్థానికులకు తెలియజేశారు. ఎస్పీ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగర్​పోలీస్​స్టేషన్​లో ఉంటారు. మండల పరిధికి చెందిన ఆర్జీలను స్వీకరించి వాటిని అక్కడిక్కడే పరిష్కరిస్తారు. రాజకీయ సమస్యలు, భూములు, ఫైనాన్స్, బెదిరింపులు ఎలాంటి ఫిర్యాదులైనా చేయొచ్చు.

  • అన్ని మండలాలు కవర్​ చేస్తా..

ప్రతినెలా రెండు, మూడు మండలాల చొప్పున అన్ని నియోజకవర్గాలు కవర్​చేస్తా. మొదట నాగార్జునసాగర్​ మండలం నుంచే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా. అక్కడి వచ్చే రిజిల్ట్స్​ను బట్టి తర్వాత దేవరకొండ డివిజన్​ పరిధిలో నిర్వహిస్తా. ఇదేవిధంగా ప్రతినెలలో రెండు, మూడు మండలాలు పర్యటిస్తా. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే మండలాలపైనే ఫోకస్ పెడ్తా. ప్రజావాణిలో ఫిర్యాదులు చాలా వస్తున్నాయి. వాటిల్లో ప్రధానంగా భూతగాదాలే ఉన్నాయి. కబ్జాలు చేసిన వాళ్లపై కేసులు పెడ్తున్నాం. కానీ భూతగాదాలను రెవెన్యూ అధికారుల పరిశీలనకు పంపిస్తున్నాం. మా రూల్ ప్రకారం పొజిషన్​లో ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టొదు. ఇబ్బంది పెడితే ఎవరైనా ఉపేక్షించేది లేదు.