నల్గొండ జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ట నిఘా : ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ట నిఘా : ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ అర్బన్, వెలుగు  :  జిల్లాలో దొంగతనాలు నివారణకు  పటిష్ట నిఘా పెట్టాలని  ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులకు సూచించారు. బుధవారం నల్గొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో  సమీక్ష నిర్వహించారు.  కూడళ్లలో, రహదారుల వెంట సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.  నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఏఎస్పీ రాములు నాయక్, డీఎస్పీలు, సీఐలు, అధికారులు పాల్గొన్నారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నేరేడుచర్ల, వెలుగు:  సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్, డ్రగ్స్ పై నిర్వహించిన అవగాహన కల్పించారు.    ఏదైనా సైబర్ మోసానికి గురైతే  వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని అన్నారు.   కార్యక్రమంలో హుజూర్ నగర్ సీఐ చరమందరాజు, నేరేడుచర్ల ఎస్సై రవిందర్ నాయక్, కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ వెంకటరమణ పాల్గొన్నారు.