సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

నల్గొండ, వెలుగు : నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని, సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధిక రాబడుల వాగ్దానాలతో మోసగాళ్లు సోషల్ మీడియా ద్వారా అమాయకులను ఆకర్షిస్తున్నారని వివరించారు. జెఫరీస్ ఎంటర్​ప్రైజెస్, సాక్షి సింగ్ మోతీలాల్ ట్రేడ్ వంటి నకిలీ మొబైల్ యాప్ ద్వారా వేర్వేరు బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు డిపాజిట్ చేయించుకుని మోసం చేస్తున్నారని తెలిపారు. మదుపరులను వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకుని అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాలని వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడుతారని తెలిపారు.

లాభం వచ్చిన తర్వాత మదుపరులు డబ్బుల విత్ డ్రాకు అవకాశం ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. జిల్లాలోని ప్రజలు నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ లను గుర్తించి వారి కాల్స్ ను బ్లాక్ చేయాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.