పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్

 పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ అర్బన్, వెలుగు : పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పారదర్శకంగా చేపట్టాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు.

పోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని తెలిపారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్​మెంట్ తెలిసి ఉండాలన్నారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పారు. మిషన్ పరివర్తన్ లో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, ఇసుక, పీడీఎస్​ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.