రక్తదానంతో ప్రాణాలు కాపాడొచ్చు: సింధూశర్మ

కామారెడ్డి టౌన్, వెలుగు: రక్తదానంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడొచ్చని ఎస్పీ సింధూశర్మ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా  జిల్లా పోలీసు ఆఫీస్​లో రెడ్​క్రాస్​సొసైటీ, పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ప్రతీఒక్కరి బాధ్యత అని, అందుకు ప్రజలందరూ ముందుకు రావాలన్నారు.

రెడ్​క్రాస్​సొసైటీ చైర్మన్​ రాజన్న, డీఎస్పీ ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది రక్తదానం చేశారు.