బోధన్, వెలుగు : బోధన్పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మాన్ సింగ్ ను నిజామాబాద్ ఎస్పీ సింధూశర్మ అభినందించారు. మండల పరిధిలో జనవరిలో 38 మంది సెల్ఫోన్లు పోగొట్టుకోవడంతో బాధితులు పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఈఐఆర్ పోర్టల్ద్వారా సెల్ఫోన్లను కనిపెట్టి 38 రికవరీ చేశారు. సెల్ఫోన్లు రికవరీ చేయడంలో జిల్లాలోనే బోధన్పీఎస్ రెండో స్థానంలో నిలిచింది. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్ మాన్సింగ్కీలక పాత్ర పోషించారు. దీంతో మంగళవారం కానిస్టేబుల్ను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు.
సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి..
కామారెడ్డి టౌన్, వెలుగు : గుర్తింపు లేని మల్టీ లెవెల్మార్కెటింగ్ కంపెనీల మోసాలు, సైబర్ నేరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులు, హెర్బల్, హెల్త్ కేర్, గృహోపకరణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటూ మార్కెటింగ్ కంపెనీలు చేసే గొలుసుకట్టు వ్యాపారాలతో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.