కామారెడ్డి జిల్లాకు కేంద్ర బలగాలు

కామారెడ్డి టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాకు మూడు కంపెనీల కేంద్ర బలగాలు చేరుకున్నట్లు ఎస్పీ సింధూశర్మ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీస్​ఆఫీస్​లో స్థానిక ఆఫీసర్లు, కేంద్ర బలగాల అధికారులతో ఎస్పీ సమావేశమయ్యారు. జిల్లాపై అవగాహన వచ్చేలా కేంద్ర బలగాలకు పవర్​పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. స్టేట్ ​బార్డర్,   ఇతర చెక్​పోస్టుల గురించి వివరించారు. కేంద్ర బలగాల ఇన్స్​పెక్టర్​రాజ్​మోహన్​సింగ్, మనోజ్​కుమార్, కంజాన్​జో,  డీఎస్పీలు  ప్రకాశ్, శ్రీనివాస్, జగన్నాథ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALS0 READ: బోధన్​లో బీఆర్ఎస్ కు ​మరో షాక్ : సుదర్శన్​రెడ్డి