కౌలాస్​ కోటను సందర్శించిన ఎస్పీ సింధూ శర్మ

కౌలాస్​ కోటను సందర్శించిన ఎస్పీ సింధూ శర్మ

పిట్లం, వెలుగు: కౌలాస్​ కోట అద్భతమైన కట్టడమని ఎస్పీ సింధూ శర్మ పేర్కొన్నారు. ఆదివారం జుక్కల్ ​ మండలంలోని కౌలాస్​ కోటను జిల్లా పోలీస్​ అధికారులతో కలిసి సందర్శించారు. కోటలోని చారిత్రక మందిరాలు,  కట్టడాలు పరిశీలించి వాటి చరిత్ర, వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు గంటల పాటు కోటలో తిరిగిన ఎస్పీ 9 గజాల ఫిరంగి,  హనుమాన్, రామాలయం, సరస్వతి, వేంకటేశ్వర మందిరాలను పరిశీలించారు.

అప్పట్లో వినియోగించిన పట్టెమంచం, తామర కొలను, మల్లికా బురుజు, ఆయుధాగారాలు, ధాన్యాగారాలను తిలకించారు. కోట వెలుపల ఉన్న అష్ట భుజమాత మందిరాన్ని దర్శించుకుని పూకౌలాస్​ కోటను సందర్శించిన ఎస్పీ సింధూ శర్మజలు చేశారు. ఎస్పీతో పాటు ట్రైనీ ఎస్పీలు, బాన్సువాడ, ఎల్లారెడ్డి డీఎస్పీలు, బిచ్కుంద సీఐ జగడం నగేశ్, ఎస్సైలు ఉన్నారు.