కామారెడ్డి, వెలుగు: మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ సింధూశర్మ పోలీస్ ఆఫీసర్లకు ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ ఆఫీస్‌లో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళల రక్షణకు పెద్దపీట వేయలన్నారు. మిస్సింగ్ కేసులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవొద్దన్నారు.
ప్రతీ ఆఫీసర్ పారదర్శకంగా డ్యూటీ చేయాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్షించారు. అనంతరం సైబర్ నేరాలకు సంబంధించిన అవగాహన పోస్టర్రి లీజ్చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఆఫీసర్లు, సిబ్బందికి అవార్డులు అందించారు. ట్రైనీ ఐపీఎస్ కాజల్‌సింగ్, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు ప్రకాశ్,శ్రీనివాస్, జగన్నాథ్‌రెడ్డి, మదన్‌లాల్, శ్రీనివాస్, ఎస్బీ సీఐ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.