- కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిశీలన
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని ఎస్పీ సింధూశర్మ సిబ్బందికి సూచించారు. శుక్రవారం కామారెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ పరిశీలించారు. కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఆకతాయిలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. వెహికల్స్తనిఖీలు నిరంతరం చేయాలని సూచించారు.
రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ ను ఎస్పీ ప్రారంభించారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి స్పెషల్ బ్రాంచి సీఐ జార్జ్ పాల్గొన్నారు.