- ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల, వెలుగు: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండగా.. గ్రామాల్లో నిఘా పెట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎస్పీ ఆఫీసులో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామానికి పోలీసులు వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకొని నిఘాపెట్టాలన్నారు.
గ్రామాల్లో సమస్యలు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఫోక్సో కేసులలో 60 రోజుల్లో ఎంక్వయిరీ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మొగిలయ్య, ఏఆర్ డి.ఎస్.పి నరేందర్ రావు, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సిఐలు టాటా బాబు, శీను, రవిబాబు. ఎస్సై రజిత తదితరులు పాల్గొన్నారు.