చోరీ కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి : ఎస్పీ శ్రీనివాసరావు

చోరీ కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి : ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల, వెలుగు : చోరీ కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీసులకు సూచించారు. మంగళవారం ఎస్పీ ఆఫీసులో పెండింగ్ కేసులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఉమెన్ మిస్సింగ్ కేసులపై స్పెషల్ ఫోకస్ పెట్టి త్వరగా ఛేదించాలన్నారు. చోరీ కేసులతోపాటు ఇతర అన్ని కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, దీని ద్వారా ముందుకు వెళ్లాలని సూచించారు. సైబర్ నేరాల్లో ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు.

సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో కళాజాత బృందాలతో క్యాంపులు పెట్టాలని చెప్పారు. 100 డయల్ కు ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఘటనాస్థలానికి చేరుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ గుణశేఖర్, డీఎస్సీ సత్యనారాయణ, సీఐలు భీమ్ కుమార్, రవిబాబు, రత్నం తదితరులు పాల్గొన్నారు.