
గద్వాల, వెలుగు: యాక్సిడెంట్ కేసులను అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేయాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. ఎస్పీ ఆఫీసులో సోమవారం క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై, ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాలపై నిఘా పెట్టాలన్నారు.
ట్రేస్ పాస్ కేసుల్లో సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. కేసుల ఎంక్వైరీ లో లేట్ అయితే సహించేది లేదన్నారు. సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయినా అమౌంట్‌ను కోర్టు పర్మిషన్ తో బాధితులకు ఇవ్వాలన్నారు. స్టేషన్‌కు వచ్చే కంప్లైంట్ పై పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలన్నారు.
.పెండింగ్‌లో ఉన్న కేసులను తొందరగా క్లియర్ చేయాలన్నారు. పొక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఎంక్వైరీ 60 రోజుల్లో చేసి కోర్టులో చార్జిషీట్ వేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగులయ్య, ఏఆర్ డీఎస్పీ నరేందర్ రావు, సీఐలు శీను, రవిబాబు, టాటా బాబు, డీసీఆర్ బీ ఎస్ ఐ రజిత తదితరులు పాల్గొన్నారు.