
గద్వాల, వెలుగు: ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ యాప్స్ పై పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే వారి సమాచారం అందించాలన్నారు. ఆన్ లైన్ లో డబ్బులు ఎక్కువగా ఇస్తామంటే నమ్మి మోసపోవద్దన్నారు. సొసైటీలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిందని అవగాహన లోపం వల్ల చాలామంది యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడి లక్షలు పోగొట్టుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఎవరైనా ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేసినా, ఆడాలని ఒత్తిడి చేసినా 100 కు ఫోన్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలని ఎస్పీ సూచించారు.