మహబూబాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్హాల్లో త్రెడ్జ్ఇట్ ఎక్సలెన్స్ గ్రూప్ సహకారంతో, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు మంచి స్పందన వచ్చిందని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ తెలిపారు. 45కు పైగా కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు వచ్చి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొత్తం 2500 మంది యువతీయువకులు హాజరు కాగా, 375 మంది ఉద్యోగ అవకాశాలు పొందగా, 612 మంది ఇంటర్వ్యూలకు ఎంపికైనట్లు వివరించారు.
అనంతరం సెలక్ట్అయిన వారికి నియామక పత్రాలను అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ జోగుల చెన్నయ్య, టౌన్ డీఎస్పీ తిరుపతి రావు, ఏఆర్ డీ ఎస్పీ శ్రీనివాస్, వివిధ కంపెనీల సమన్వయ కర్త చందర్, కృష్ణతోపాటు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు ఎస్పీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ చైర్మన్నాగవాణి ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్లను ఎస్పీ సుధీర్రామ్నాథ్కేనన్డాక్టర్లుడేవిడ్, అశోక్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ఆడపిల్లలను రక్షించుకుంటూ, అన్నిరంగాల్లో రాణించేలా తోడ్పాటునందించాలన్నారు.